13 August, 2026 | 12:19 AM

మల్లికార్జునికి అన్నాభిషేకం, మృత్యుంజయ హోమం

12-08-2026 08:55 PM

ప్రతి అమావాస్య మృత్యుంజయ హోమాలు, పౌర్ణమికి  మహా చండీ హోమం

ఆలయ ఈవో దేవానాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్

అమీన్ పూర్: బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా  భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తుడు మణికంఠ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, వారి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో దేవానాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమం, ప్రతి పౌర్ణమి రోజున మహా చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు ముందురోజు ఆలయ అధికారులు, అర్చకులు లేదా దేవాలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పూజా కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈవో దేవానాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్ కోరారు.