calender_icon.png 22 February, 2026 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేక్నాంపూర్ చెరువు ప్రక్షాళన

22-02-2026 01:56:27 AM

రూ. 99.50 కోట్లతో నాలా అభివృద్ధి 

చిత్రపురి కాలనీలో రోడ్డు విస్తరణకు కమిషనర్ సృజన ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన చెరువుల పరిరక్షణే లక్ష్యంగా కమిషనర్ జి. సృజన క్షేత్రస్థాయి పర్యటనలు ము మ్మరం చేశారు. శనివారం ఆమె నేక్నాంపూర్ చిన్న చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మురుగునీటి మళ్లింపు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల సుందరీకరణ,మురుగు నీటి ప్రవాహ నియంత్రణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

నేక్నాంపూర్ పెద్ద చెరువులోకి కలిసే పాండేనవాగుపై చేపట్టిన భారీ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను కమిషనర్ సమీక్షించారు. సుమా రు రూ. 99.50 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు. అనం తరం కమిషనర్ చిత్రపురి కాలనీ ప్రధాన రహదారిని సందర్శించారు. రహదారికి ఇరువైపులా పేరుకు పోయిన భవన నిర్మాణ వ్యర్థాలను గమనిం చి, వాటిని తక్షణమే తొలగించాలని పారిశుధ్య అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చిత్రపురి కాలనీ రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. నగర అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిషనర్ సృజన అధికారులకు దిశానిర్దేశం చేశారు.