26 August, 2026 | 2:34 PM

అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.!

26-08-2026 12:19 PM

కాలనీ రోడ్లపైనే వాహనాల వాషింగ్‌

ధ్వంసమవుతున్న మున్సిపాలిటీ రోడ్లు

ఇబ్బందులు పడుతున్న వాహనదారు

నాగర్‌ కర్నూల్ ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హోసింగ్ బోర్డు ప్రాంతంలోని ఓ వాహన షోరూమ్ సర్వీస్ సెంటర్‌లో నిత్యం కాలనీ రోడ్డుపైనే వాహనాలను వాషింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజంతా వాహనాల వాషింగ్ కొనసాగుతుండటంతో రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఫలితంగా రోడ్డు ధ్వంసం అయిపోతుంది అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి సిసి రోడ్లు నిర్మాణం చేసినప్పటికీ స్థానికులు ప్రైవేటు వ్యక్తుల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా సిసి రోడ్డు ధ్వంసం అవుతున్నాయని మండిపడుతున్నారు.  సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై వాహనాల వాషింగ్‌ను అడ్డుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.