ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నీరటి శంకర్
సుల్తానాబాద్, మే 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipality) పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన నీరటి శంకర్ ను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ ఎన్ టి యు సి) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం చేసినట్లు ఆల్ ఇండియా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు డాక్టర్ జి, సంజీవరెడ్డి గురువారం ప్రకటించారు,
మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) చేతుల మీదుగా నీరటి శంకర్ నియామక పత్రాన్ని తీసుకున్నారు, తన నియామకానికి సహకరించిన ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి , రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎంపీ వంశీకృష్ణ , ఐ ఎన్ టి యు సి నేషనల్ సెక్రెటరీ బాబర్ సలీం పాషా, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, నీరటి శంకర్ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు,






