సింగరేణి ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కొత్తగూడెం,(విజయక్రాంతి):సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో VKCM ప్రాజెక్టు ,ప్రభావిత మరియు పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా , రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (BP), మధుమేహం (Sugar) వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. సింగరేణి సంస్థ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి కట్టుబడి ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపించి, ఇలాంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. VKCM ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహ రావు మాట్లాడుతూ, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి, వి.కె.సి.ఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహ రావు , వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్ , AITUC నాయకులు ఎం.ఆర్.కే ప్రసాద్ , INTUC నాయకులు గోపు కుమార్ ,ఇతర వైద్య సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






