30 August, 2026 | 5:20 AM

ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం

30-08-2026 12:00 AM

గాయంతో తప్పుకున్న స్టార్ అథ్లెట్

రోహిత్ యాదవ్ పైనే భారత్ ఆశలు

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖచ్చితంగా మెడల్ గెలు స్తాడని భావించిన స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా గేమ్స్‌కు దూరమయ్యాడు. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా కాలి చీలమండ గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

లౌసానే డైమండ్ లీగ్ ముగిసిన తర్వాత జరిగిన శిక్షణ సమయంలో మడిమ వద్ద లిగమెంట్ టియర్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రా స్వయంగా వెల్లడించాడు. వైద్యులు మరియు తన సపో ర్ట్ టీంతో చర్చించిన తర్వాత, సంపూర్ణంగా కోలుకోవడానికి ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని పోటీల నుండి తప్పుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. వచ్చే నెల జపాన్‌లోని ఐచి-నా గోయాలో జరగనున్న 2026 ఆసి యా క్రీడలకు నీరజ్ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

గతంలో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనే అతడి ఆశలకు బ్రేక్ పడింది. బ్రస్సెల్స్‌లో జరగబోయే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా క్వాలిఫై అయినప్పటికీ, ఈ గాయం వల్ల ఆ టోర్నీలోనూ బరిలోకి దిగలేకపోతున్నాడు. కాగా ఈ గాయం నిరాశ కలిగిస్తోంద నీ నీరజ్ చెప్పాడు. క్రీడల్లో ఇటువంటి ఎదురుదెబ్బలు కూడా ప్రయాణంలో భాగమేన నీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా త్వరగా కోలుకోవడంపైనే ఉందన్నాడు. మరింత దృఢం గా మళ్లీ ట్రాక్‌పైకి వస్తానని నీరజ్ చోప్రా ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. నీరజ్ గైర్హాజరీలో ఇప్పుడు ఆసియా క్రీడల్లో భారత జావె లిన్ త్రో విభాగంలో పతక ఆశలు రోహిత్ యాదవ్‌పైనే ఉన్నాయి. రోహిత్ ఇటీవల 87.68 మీటర్ల అత్యుత్తమ త్రోతో స్వర్ణం సా ధించి మంచి ఫాంలో ఉన్నాడు.