30 August, 2026 | 4:17 AM

జింబాబ్వేపై బ్రెవిస్ విధ్వంసం

30-08-2026 12:00 AM

ట్రై సిరీస్ లో దక్షిణాఫ్రికా బోణీ 

విండ్‌హోక్, ఆగస్టు 29 : నమీబియా చేతిలో షాక్ తిన్న దక్షిణాఫ్రికా మళ్ళీ గాడిన పడింది. ట్రై సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు.

145 పరుగుల టార్గెట్‌ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాల్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. బ్రెవిస్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.