24 July, 2026 | 4:32 AM

వరి సాగుపై పునరాలోచించాలి: మంత్రి తుమ్మల

24-07-2026 12:03 AM

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : ఎల్‌నినోపై జిల్లాల వారీగా వచ్చిన సూచనలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. గురువారం సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని  తెలిపారు.