8 May, 2026 | 3:48 AM

హైదరాబాద్‌కు నేషనల్ సైన్స్ సెంటర్

08-05-2026 01:44 AM
  1. యువతకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం
  2. ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి సీఎస్‌ఐఆర్‌లో పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): వేగం గా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు ఇప్పుడు ‘నేషనల్ సైన్స్ సెంటర్’(ఎన్‌ఎస్‌సీ) కూడా రాబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నగరం లో రక్షణ, సైన్స్, ఐటీ, విద్యా రంగాలకు సం బంధించిన అనేక కేంద్ర పరిశోధన సంస్థలు ఇక్కడ ఉండగా, వాటి సరసన ఎన్‌ఎస్‌సీ చేరుతుందన్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారని, జహీరాబాద్, వరంగల్‌లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు.

తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌లో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెం టర్ పనులను ఎంపీ ఈటల రాజేందర్‌తో కలి సి కిషన్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మా ట్లాడుతూ ఈ సైన్స్ సెంటర్ హైదరాబాద్‌లోని ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలవబోతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సెంటర్‌ను మన హైదరాబాద్‌కి మంజూరు చేశారని, వచ్చే ఏడాది చివరి నాటికి దీనిని పూ ర్తిచేసి, ప్రజలకు అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

 ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10న  జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్‌లో మెగా టెక్ట్స్‌టైల్ కాకతీయ పార్క్ పనులకు ఆయన భూమిపూజ/ప్రారంభోత్సవాలు చేస్తారని, జాతీయ రహ దారులు, రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారన్నారు. భవిష్య త్‌లో వరంగల్ ఎయిర్‌పోర్ట్,  రైల్ మాన్యుఫాక్చరింగ్ యూ నిట్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నా య న్నారు. అలాగే ములుగులో ఏర్పాటు కానున్న ట్రైబల్ యూనివర్సిటీకి, ఎయిమ్స్ వంటి ఆసుపత్రులకు కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో ప్రధాని చేతుల మీ దుగా భూమిపూజలు లేదా ప్రారంభోత్సవా లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.