24 April, 2026 | 4:27 PM

అభివృద్ధికి సహకరించండి... ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

24-04-2026 02:45 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని సోనాల గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ సుధీర్ రెడ్డి కార్యదర్శి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలను చర్చించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి వెంకటరమణ లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రజలందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.