డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): శంకర్ గౌడ్ మృతికి కారుకులైన వారిపై చట్టపరిమైన చర్యలు తీసుకోవాలనీ విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 32 డిమాండ్లతో ఇచ్చిన సమ్మె నోటీస్ ను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకుండా సమ్మె కు కారణమయ్యారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సాగ దిగడం వల్లనే కార్మికులు అసహనానికి లోనవుతున్నారని వాపోయారు. ఆ ఆత్మహత్యలకు తెగబడుతున్నారని తెలిపారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ సమ్మె చేసిన సందర్భంలో 32 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదనీ విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు కాకుండా పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను నివారించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి గని కార్మిక సంఘం (SGKS) రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్, (TUCI) రాష్ట్ర నాయకులు గోగ ర్ల శంకర్,(AIFTU) రాష్ట్ర నాయకులు ఎం.పోశమల్లు,TUCI బెల్లంపల్లి బాధ్యులు అడ్డూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.






