జాతీయ లైబ్రెరియన్ల దినోత్సవం
13-08-2026 12:36 AM
మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 12: మంచిర్యాలలో నీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ 134వ జయంతి సంద ర్భంగా కళాశాల గ్రంథాలయ అధికారిణి డా క్టర్ ఎన్ పద్మారాణి ఆధ్వర్యంలో బుధ వా రం జాతీయ లైబ్రెరియన్ల దినోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాం డురంగ శర్మ డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొన్నారు.






