10 April, 2026 | 2:58 AM

నిమ్స్‌లో అఫెరిసిస్‌పై జాతీయ స్థాయి వర్క్‌షాప్

10-04-2026 12:55 AM

పంజాగుట్ట, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఇమ్యునోహెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ విభాగం ఆధ్వర్యంలో అఫెరిసిస్ అత్యుత్తమ సేవలు: టెక్నాలజీ, భద్రత, వైద్య నైపుణ్యాల సమన్వయం అనే అంశంపై జాతీయ స్థాయి నిరంతర వైద్య విద్య, వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించారు.

నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మార్గదర్శకత్వంలో, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అఫెరిసిస్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, తాజా సాంకేతికత, రోగుల భద్రతా ప్రమాణాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రాన్స్ఫ్యూ జన్ మెడిసిన్ సహకారంతో జరిగిన ఈ వేడుకకు డాక్టర్ సుధీర్ కుమార్ వుజ్జిని చైర్పర్సన్గా, డాక్టర్ బి. శాంతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించారు.

ఈ సదస్సులో చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ నిపుణుడు డాక్టర్ రట్టి రామ్ శర్మతో పాటు ఎయిమ్స్ బిబినగర్, స్విమ్స్ తిరుపతి, యశోద, ఏఐజీ, అపోలో వంటి ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మొత్తం 122 మంది ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో, 50 మందికి ప్రత్యేకంగా హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ ద్వారా ప్రాయోగిక అవగాహన కల్పించారు. వైద్య విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో డాక్టర్ స్వాతి (పోస్టర్ ప్రెజెంటేషన్), డాక్టర్ కార్య (పేపర్ ప్రెజెంటేషన్) విజేతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఇంట రాక్టివ్ సెషన్లు అఫెరిసిస్ చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వైద్యుల కు ఎంతో ఉపయోగపడ్డాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవం తం కావడానికి సహకరించిన సాంకేతిక నిపుణులు, పీజీ విద్యార్థులు, ఫ్రెసీనియస్ కాబి, టెరుమో పెన్పోల్ వంటి స్పాన్సర్ సంస్థలకు విభాగాధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వర్క్‌షాప్ ద్వారా పొందిన అధునాతన జ్ఞానాన్ని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆకాంక్షించారు. వైద్య రంగంలో ఇలాంటి శిక్షణా కార్య క్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా క్లినికల్ నైపుణ్యాలు మెరుగుపడతాయని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు.