19 June, 2026 | 2:25 AM

విజ్ఞాన్స్ వర్సిటీకి జాతీయస్థాయి పేటెంట్

19-06-2026 01:12 AM

వెల్లడించిన డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి జాతీయస్థాయి పేటెంట్ లభించినట్లు విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు బుధవారం వెల్లడించారు.

‘అపారటస్ ఫర్ కంట్రోల్ మిక్సింగ్ ఆఫ్ కాంక్రీట్ అట్ కన్‌స్ట్రక్షన్ సైట్స్’ అనే అం శంపై విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరిశేఖర్ మిట్ట చేసిన పరిశోధనకుగానూ భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం పేటెంట్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. పేటెంట్ సాధించిన పరిశోధక బృందం లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ హరిశేఖర్ ఏకైక ప్రతినిధిగా, సహ-రచయితగా వ్యవ హరించిన ఘనత సాధించారని పేర్కొన్నారు. సహపరిశోధకులుగా డాక్టర్ శ్రీకాంత్ సర్జెరావ్ బొబాడే, డాక్టర్ సువందన్ సరస్వత్, డాక్టర్ ప్రియాంక సింగ్, డాక్టర్ దివ్య చంద్ర, మిస్టర్ నితిన్ కుమార్ చౌహాన్, డాక్టర్ రుచి సరస్వత్, మిస్టర్ వికాస్ కుమార్ సింగ్లా, మిస్టర్ నీరజ్ వర్మ, డాక్టర్ మొహమ్మద్ మజిద్ ఉన్నారని వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ హరిశేఖర్ మిట్ట మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మక మైన ఈ జాతీయ పేటెంట్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పరిశోధనలో భాగంగా నిర్మాణ స్థలాలలో కాంక్రీట్ మిశ్రమాన్ని ఖచ్చితమైన ప్రమాణాలతో నియం త్రించే పరికరాన్ని రూపొందించినట్లు చెప్పా రు. జాతీయస్థాయి పేటెంట్ సాధించి విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలను పెంచిన డాక్టర్ హరి శేఖర్ మిట్టను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిశోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.