నసురుల్లాబాద్ యువకుడికి TPCC సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ బాధ్యతలు
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన యువకుడు ఫరీద్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) సోషల్ మీడియా విభాగంలో సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ నియామకాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఫరీద్ కృషి చేయనున్నట్లు తెలిపారు. యువతలో చైతన్యం పెంపొందించడంతో పాటు పార్టీ కార్యకలాపాలను డిజిటల్ వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఫరీద్ నియామకంపై నసురుల్లాబాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సోషల్ మీడియా విభాగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని ఫరీద్ అన్నారు.






