8 August, 2026 | 6:54 PM

కాంగ్రెస్ సేవాదళ్ బిక్కనూర్ మండల అధ్యక్షుడిగా మాధవరెడ్డి

08-08-2026 04:20 PM

బిక్కనూర్, ఆగస్టు 8(విజయ క్రాంతి):  కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా బిక్కనూర్ మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా గిజ్జివెల్లి మాధవరెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సేవాదళ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి కృషి చేస్తానని తెలిపారు.