1 July, 2026 | 8:05 PM

Breaking News

ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •  

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

01-07-2026 06:51 PM

ముకరంపుర,(విజయక్రాంతి): లాభాల బాటలో నడిచే ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం సిగ్గుచేటని వెంటనే ఈ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోతుందనే ఉద్దేశముతో ఆర్టీసీలో కార్గోను ప్రవేశపెట్టిందని దీని ద్వారా ఎన్నో లాభాలు వచ్చాయని కానీ నేడు అదే కార్గో అప్పుల్లో ఉందనే సాకుతో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని కుట్రకు పూనుకోవడం సిగ్గుచేటని అన్నారు.

 ప్రస్తుతం కార్గో ద్వారా ఏటా వంద నుంచి 120 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తుందని, గతంలో జరిగినటువంటి టెండర్లలో 35 కోట్లకు ఒక ప్రైవేటు సంస్థకు టెండర్ అప్పగించగా కొత్త అగ్రిమెంట్ ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అవకాశం ఉందని దీంతో కార్గో పై ఆధారపడ్డ దాదాపు 500 మందికి పైగా హమాలీల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే కార్గో ప్రైవేటీకరణను  నిలిపివేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.