డెహ్రాడూన్: మాజీ వరల్డ్‌కప్ విన్నర్ నర్మద 38వ జాతీయ క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అనీశ్ భన్వాలా పసిడి సొంతం చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన నర్మద ఫైనల్లో 254.4 పాయింట్లు స్కోరు చేసి టాప్ స్థానం కైవసం చేసుకోగా.. ఆర్యా బోర్సే, రమితా రెండూ, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ క్రమంలో అపూర్వ చండీలా (252.9 పాయింట్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును నర్మద బద్దలుకొట్టింది. ఇక పురుషుల 25 మీ ర్యాపిడ్ పిస్టల్ కేటగిరీలో భన్వాలా ఫైనల్లో 31 హిట్స్ సాధించి తొలి స్థానంలో నిలవగా.. గుర్ప్రీత్, విజయ్‌వీర్ రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.