నారాయణ స్కూల్ విద్యార్థి క్షివ్ చకావే అరుదైన రికార్డ్!
- అండర్ ౬ చెస్ విభాగంలో ప్రపంచస్థాయిలో 10వ ర్యాంక్
ఇండియాలో 3వ ర్యాంక్ కైవశం!
హైదరాబాద్, మార్చి 24(విజయకాంతి): నారాయణ స్కూల్స్‌కి చెందిన చెస్ ప్రతిభావంతుడు క్షివ్ చకావే అసాధారణ విజయా న్ని నమోదు చేశాడు. ఫీడే(ఎఫ్‌ఐడీఈ), ఆల్ ఇండియా చెస్ ఫెడ్‌రెషన్(ఏఐసీఎఫ్) గుర్తిం పు పొందిన ప్రతిష్ఠాత్మక ‘ఎల్‌బీహెచ్‌ఎం ఆ ల్ ఇండియా ఓపెన్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్’లో తన అత్యుత్తమ ప్రదర్శనతో క్షివ్ చకావే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సాధించాడు.
అతి చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభను, వ్యూహాత్మక చతురత ను ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ టో ర్నమెంట్‌లో అండర్ 6 విభాగంలో 3వ ర్యాంక్ సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. తన ప్రతిభను మరింతగా మెరుగుప రుచుకుంటూ క్షివ్ 1560 ఫీడే(ఎఫ్‌ఐడీఈ) రేటింగ్‌ను సాధించాడు. తద్వారా అండర్ ౬ విభాగంలో ప్రపంచంలోని టాప్ 10 క్రీడాకారులలో ఒకరిగా నిలవడమే కాకుండా, భారతదేశంలో 3వ ర్యాంక్, మహారాష్ట్రలో త న వయస్సు విభాగంలో నెం.1 ర్యాంక్ క్రీడాకారుడిగా స్థానం దక్కించుకున్నాడు.
క్షివ్ ప్ర స్తుతం ఈ ఏడాది జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరగనున్న నేషనల్ అండర్ ౭ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో తన జాతీయ స్థాయి స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విజయంపై నా రాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సిం ధూర నారాయణ మాట్లాడుతూ ‘ఇంత చిన్న వయస్సులో క్షివ్ సాధించిన ఈ విజ యం కేవలం ఒక మైలురాయి మాత్రమే కా దు, ఇది అతని ఏకాగ్రత, పట్టుదల, చెస్ ఆట పట్ల ఉన్న మక్కువను ప్రదర్శిస్తోందన్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యార్థి క్షివ్ చకావేను ప్రత్యేకంగా అభినందించారు.




