calender_icon.png 11 February, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరవణే ఆత్మకథ ముద్రణే జరగలేదు!

11-02-2026 01:06:37 AM

తేల్చిచెప్పిన ప్రచురణ సంస్థ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పుస్తకం అసలు ముద్రణకే వెళ్లలేదని మంగళవారం పెంగ్విన్ రాండ మ్ హౌస్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ సంస్థ ఒక్క కాపీ అయినా ముద్రించలేదని తేల్చిచెప్పింది. అంతేకాదు.. డిజిటల్ కాపీ అయినా.. విడుదల చేయలేదని స్పష్టం చేసిం ది.

అలాంటప్పుడు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేతిలోని పుస్తకం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న తలెత్తుతున్నది. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. తాను ప్రచురణ సంస్థ ప్రకటన అంత ముఖ్యమైన అంశం కాదని, నరవణే తన పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ‘వాస్తవమా..? కాదా’ అన్నదే ముఖ్యమని తేల్చిచెప్పారు. 

మరోవైపు ఆ పుస్తకం పీడీఎఫ్ కాపీలు వైర ల్ అవుతుండటంపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు. ఈ పరిణామాలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ముద్రణేకాని పుస్తకం రాహుల్ చేతికి ఎలా వచ్చిందనే ఇప్పుడు మిస్టరీగా మారింది.