19 August, 2026 | 2:01 AM

నరాల సాంబశివరెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు

19-08-2026 12:00 AM

ఎర్రుపాలెం, ఆగస్టు 18, ( విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన నరాల సాంబశివరెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్తా అవార్డును అందుకున్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా  హైదరాబాదు  రవీంద్ర భారతి  లో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యముతో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. క్రీడారంగం తో పాటు కళా రంగంలో సేవ చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు నరాల సాంబశివారెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు ను ప్రముఖ సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహ రావు,

సరస్వతి ఉపసకులు దైవజ్ఞ శర్మ, వంశి ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కా వెంకటరమణ, సినీ నటులు జేన్నీ, ఏసిపి పింగళి నరేష్ రెడ్డి, సినీ దర్శకులు మల్లం రమేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బలుసుపాటి జయరాజు, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ యన్నం పిచ్చిరెడ్డి, పెద్ద గోపవరం సొసైటీ అధ్యక్షులు శీలం అక్కిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఉప సర్పంచ్ వేమిరెడ్డి రామిరెడ్డి, సిలివేరు వెంకటేశ్వర్లు తదితరులు నరాల సాంబశివరెడ్డికి అభినందనలు తెలిపారు.