29 March, 2026 | 7:11 PM

కిరణ్ ముదళ్‌కర్ న్యాయవాదికి ఘన సన్మానం

29-03-2026 05:49 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా నియమితులైన కిరణ్ ముదళ్‌కర్ ని ఆదివారం  పాల్వంచ అయ్యప్ప నగర్‌లోని ఆయన స్వగృహంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో మాలోత్ ప్రశాంత్,నాగేంద్ర బాబు,మాదారపు లక్ష్మణ్,బల్లాడి దిలీప్, అజ్మీరా రాము, సాగంటి వెంకటేష్, సంకినేని రుద్ర, విక్కీ, కిట్టు, భట్టు అశోక్, శేఖర్, కొత్తపల్లి విజయ్, బానోత్ బాలాజీ, రాజా, సన్నీలు పాల్గొన్నారు.