29 March, 2026 | 7:13 PM

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

29-03-2026 05:41 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రంలోని వరంగల్-2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు డిపో లో ఛార్జింగ్ చేస్తుండగా కింది భాగంలో మంటలు చెలరే గాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి వేశారు. ఈ విషయంపై డిపో మేనేజర్ రవిని వివరణ కోరగా ఎలక్ట్రిక్ బస్సులో 12 బ్యాటరీలు ఉంటాయని, అందులో ఒక బ్యాటరీలో మంటలు వచ్చాయని తెలిపారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే మంటలను చల్లార్చి అదుపులోకి తీసుకొ చ్చారని, ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు.