29 March, 2026 | 7:10 PM

జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ సమన్వయంతో అక్షరాభ్యాసం ఉల్లాస్

29-03-2026 05:56 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సమన్వయంతో అమ్మకు అక్షరాభ్యాసం ఉల్లాస కార్యక్రమాన్ని అమలు చేసిందని మండల ఇంచార్జ్ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ... అమ్మకు అక్షరమాల పేరుతో మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.

ఉల్లాస్లో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళ నిరక్షరాశులకు గుర్తించారు. అక్షర వికాసం పుస్తకల సహాయంతో తెలుగు చదవడం అంకెలు గుర్తించడం సాధన చేయించారు. కామారెడ్డి జిల్లాలో 526 సెంటర్లు 16,331 మంది మహిళలకు పరీక్ష నిర్వహించారు. అదే విధంగా నాగిరెడ్డిపేట్ మండలంలో 1867 నిరక్షరాశులను గుర్తించడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు.

మొదటి విడతగా 26 సెంటర్లు 500 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం నూకల శ్రీనివాస్, మండల ఇన్చార్జ్ ఏపిఎం రామ్ నారాయణ, అచ్చయపల్లి సర్పంచ్ సాయిలు, ధర్మారెడ్డి సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, అక్కంపల్లి సర్పంచ్ వెంకా గౌడ్, ఉపసర్పంచులు గౌడ్, సీసీలు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.