తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు ఆమోదం
హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, కానీ పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే చట్టం తీసుకొచ్చామని, అంతేకాకుండా కేంద్రం ఈ చట్టాన్ని 2007లోనే తెచ్చిందని గుర్తు చేశారు.
కేంద్ర చట్టం ప్రకారం రూ.10 వేలకు మించి ఇచ్చే అవకావం లేదని, సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావటం బాధాకరమని, తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలని, తల్లిదండ్రులను చూసుకోలేనోడు సమాజంలో బతకడానికి విల్లేదు అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందన్నారు.




