29 March, 2026 | 7:11 PM

ఘనంగా మట్టల ఆదివారము

29-03-2026 05:53 PM

అచ్చంపేట: అచ్చంపేటలోని షాలేము ఎంబి చర్చిలో ఘనంగా మట్టల ఆదివారము నిర్వహించారు. యేసు క్రీస్తు గాడిదపై రాజుగా వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈత మట్టలు చేతపట్టుకొని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు పట్టణంలోని పురవీధుల వెంబడి మట్టలను తీసుకొని ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మట్టల ఆదివార విశిష్టతను ప్రదర్శన ద్వారా సన్నివేశాన్ని ప్రదర్శించారు. పాస్టర్   సందేశ మిస్తు యేసు క్రీస్తు అందరికి ప్రభువై యున్నాడు ఆయన నీతియు, రక్షణ, సమాధానము గల రాజు అని బోధించారు. కార్యక్రమంలో ముఖ్య సందేశకులు రెవ.అనిల్ కుమార్, పాస్టర్ పరంజ్యోతి,  చైర్మన్ జేమ్స్, వైస్ చైర్మన్ అబ్షాలోము, సెక్రటరీ కరుణాకర్, ట్రెజరర్ భాస్కర్, జాయింట్ సెక్రటరీ చంద్రకాంత్, సంఘ సభ్యులు   పాల్గొన్నారు.