14 August, 2026 | 10:03 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

కన్వీనర్, కో కన్వీనర్ లకు సన్మానం

14-08-2026 08:48 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి అనుభవిజ్ఞులైన 20 మంది అధ్యాపకులచే నిర్వహించిన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ ఎం. కామ్. శిక్షణ పొందిన విద్యార్థుల్లో రాష్ట్రస్థాయి 1వ ర్యాంకు, 5వ ర్యాంకుతో పాటు టాప్-100లో ఏకంగా 18 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడంతో శిక్షణ కార్యక్రమం కన్వీనర్, కో కన్వీనర్లు డాక్టర్ బూర్ల నరేష్ మరియు డాక్టర్ కాంపల్లి అర్జున్ లను శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య పి. సతీష్ కుమార్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ... ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించడం ద్వారా ప్రతిభావంతులైన పేద గ్రామీణ విద్యార్థులకు యూనివర్సిటీలలో సీట్లను పొందనున్నారు అని తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎంట్రన్స్ కోచింగ్ కన్వీనర్ డా. బూర్ల నరేష్, కో-కన్వీనర్ డా. కాంపల్లి అర్జున్, రిసోర్స్ పర్సన్స్, అధ్యాపక బృందాన్ని అధికారులు అభినందించారు.