30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నాచారం పీఎస్ కు అవార్డు..

18-12-2025 07:27 PM

ఉప్పల్ (విజయక్రాంతి): వీజె కన్సల్టెన్సీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన నాణ్యత నిర్వహణ వ్యవస్థ సర్వేలో నాచారం పోలీస్ స్టేషన్ కు ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు గురువారం రోజున నాచారం పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా భద్రత చట్టాలు అమలు శాంతి భద్రతల నిర్వహణ సేవలపై క్యూఆర్ ఓ ఆధ్వర్యంలో కొంతకాలంగా నగరంలో పోలీస్ స్టేషన్ సందర్శించి సర్వేలు నిర్వహించామని తెలిపారు.

ఈ సర్వేలో నాచారం పోలీస్ స్టేషన్ కు ఉత్తమ గుర్తింపు లభించిందని ప్రజల భద్రత కల్పించే విషయంలో నేర నియంత్రణ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రత పెట్టుకోవడం లాంటిపై ఓటింగ్ శాతం బాగా వచ్చిందని వాళ్ళు తెలిపారు. అనంతరం ఆ సంస్థ నిర్వాహకులు గాబ్రియల్ నాచారం ఎస్ హెచ్ ఓ ధనంజయ గౌడ్ కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సెక్టార్ ఎస్సైలు ఎస్ మై బల్లి ప్రభాకర్ రెడ్డి నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.