15 April, 2026 | 12:18 AM

అంబేద్కర్ లాంటి మహానీయులు అరుదుగా పుడతారు

14-04-2026 08:11 PM

* పాపన్నపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మైనంపల్లి

పాపన్నపేట: అంబేద్కర్ లాంటి మహానీయులు నూటికో, కోటికో ఒకరు జన్మిస్తారని అలాంటివారు మనదేశంలో జన్మించడం మన అదృష్టమని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహ దాతగా వ్యవహరించారు. అలాగే ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అంతకుముందు పాపన్నపేట గ్రామ శివారు నుండి హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.