1 July, 2026 | 2:22 AM

వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

01-07-2026 01:31 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్

షాద్నగర్, జూన్ 30(విజయక్రాంతి)  షా ద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృ ష్టించిన వ్యాపారవేత్త మహ్మద్ హాజీ (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ మంగళవా రం మీడియాకు వెల్లడించారు. కేసు వివరా లో కి వెళ్లితే నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన మహ్మద్ హాజీ ఈ నెల 22న అదృశ్యమయ్యాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పో లీసులు దర్యాప్తు ప్రారంభించారు. బిజినపల్లికి చెందిన పానుగంటి అరవింద్ జీ (36), వీరకారి శివాజీ (35). భూవ్యాపార లావాదేవీలు, ఆర్థిక విభేదాల నేపథ్యంలో నిందితులిద్దరూ మహ్మద్ హాజీని కారులో తీసుకెళ్లి హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహా న్ని షాద్నగర్ సమీపంలోని ట్రూ ల్యాండ్మార్క్9ఈఎక్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ పరిధిలోని ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టా రు.

నిందితుల సమాచారం మేరకు పోలీసు లు మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కారు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జూన్ 29న నిందితులను అదుపులోకి తీసుకోగా వారు నేరాన్ని అంగీకరించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను షాద్ నగర్ డీసీపీ అభినందించారు.