29 August, 2026 | 8:39 PM

Breaking News

సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర   •  

అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం

01-07-2026 01:29 AM

ఘట్ కేసర్, జూన్ 30 (విజయక్రాంతి) : అనురాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎన్ హాన్సింగ్ టీచింగ్ అండ్ లర్నిం గ్ ఎవిడెన్స్ బేస్డ్ అప్ప్రోచెస్ అనే అంశంపై అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ ఉట్ల బాలాజీ ప్రా రంభించారు. ఈసందర్భంగా విభాగాధిపతి డాక్టర్ వి. విష్ణు వందన ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ పరిశోధన మౌలికాంశాలు, వివిధ పరిశోధన పద్ధతులపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు.

అనంతరం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ బి.కె. మిశ్రా సెమినల్ పరిశోధనా పత్రాలను ఆధారంగా తీసుకుని పరిశోధన సమస్యలను గుర్తించడం, పరిశోధన లక్ష్యా లు, పరిశోధన ప్రశ్నలు, హైపోథీసిస్లను రూ పొందించే విధానాన్ని వివరించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ వంటి విభాగాలకు సంబంధించిన కేస్ స్టడీలను విశ్లేషించారు. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకుల బోధనా నైపుణ్యాలు, సామర్థ్యాలు మరింత మెరుగుపడే లా మార్గదర్శకత్వం అందించబడింది.