13 March, 2026 | 4:09 PM

మూసీ బాధితులెవరూ భయపడొద్దు.. హరీశ్ రావు భరోసా

13-03-2026 02:13 PM

హైదరాబాద్: మూసీ జన ఆందోళన్ కమిటీ(Musi Jana Andolan Committee) ప్రతినిధులు, వివిధ బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాసితులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును(Harish Rao) కలిశారు. ఈ సందర్బంగా మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ చేస్తున్న విధ్వంసం గురించి హరీశ్ రావుకి వివరించారు. వాళ్లు పడుతున్న  ఆవేదనను హరీశ్ రావుకు చెప్పుకున్నారు.

అసెంబ్లీ వేదికగా తమ సమస్య పై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. మూసీ బాధితులెవరూ భయపడొద్దు, మీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్ ప్రభుత్వం(Revanth Government) సాగిస్తున్న విధ్వంసం, అక్రమ కూల్చివేతలు, అరాచక ఆగడాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని, బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.