భార్యను హత్య చేసి.. మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు
ఖానాపూర్‌మే 15( విజయక్రాంతి) ఖానాపూర్ మండలం తర్లపాడు అడవుల్లో అను మానాస్పస్థితిలో మృతి చెందిన నల్ల మౌనిక కేసును చేదించినట్టు నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. వరకట్నం కోసం వేధించిన భర్త నల్ల అరుణ్ భార్యను పథకం ప్రకారం హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టి హత్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. ఖానాపూర్ చెందిన నల్ల అరుణ్ మౌనికకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది.
అప్పటినుంచి వరకట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు వేధించారు. దీంతో ఎన్నోసార్లు ఇంట్లో గొడవలు జరగగా పెద్ద మనుషుల సహకారంతో సర్దుకుపోయారు. ఈ నెల 9న ల్లా అరుణ్ తన భార్య మౌనికను పథకం ప్రకారం ఊరికి వెళ్దామని చెప్పి తర్లపాడు అడవుల్లో ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు విచారణలో తేలింది . ఆమెపై ఉన్న ఐదు తలల బంగారం దోచుకుని తన భార్య కనిపించడం లేదని ఊరికి చెప్పిందని అందరినీ నమ్మించారు. అనంతరం మామిడి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తర్లపాడు అటవీ సమీపంలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారం జరిపి అనుమానాస్పస్థి కేసు నమోదు చేశారు.
మహిళకు గాయాలు ఉండడం బట్టలు లేకపోవడం ముందుగా అత్యాచారం హత్య జరిగినట్టు భావించారు. దీన్ని అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు సిసి ఫుటేజీ అక్కడ దొరికిన ఆడవాళ్ళ ప్రకారం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పరిశోధన చేసి నల్ల అరుణ్ ను అదుపులో తీసుకొని తమదైన శరీరం విచారణ జరిపించామన్నారు. దీంతో ఆయన నేరం ఒప్పుకున్నారని తెలిపారు. అతడు వినియోగించిన సైకిల్ సెల్ఫోన్ దొంగిలించిన ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అరుణ్ తల్లిదండ్రులైన శ్రీనివాస్ ఆడేళ్లపై కేసు నమోదు చేశామని మహిళలను హత్య చేసే చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కేసును 24 గంటల్లోనే చేదించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ అజయ్ కుమార్ ఎస్త్స్ర రాహుల్ తదితరులు ఉన్నారు.






