calender_icon.png 14 February, 2026 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ ఫలితాల విడుదల

13-02-2026 04:00:01 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు దక్కని మ్యాజిక్ ఫిగర్

చైర్మన్ పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో చైర్మన్ పీఠం కోసం రాజకీయ కసరత్తు మొదలైంది.

వార్డు వారీగా గెలుపొందిన అభ్యర్థులు

వార్డు–1: వినోద్ – స్వతంత్ర

వార్డు–2: వైరాగాడే గోవిందు – స్వతంత్ర

వార్డు–3: మెంగ్రే ఆకాష్ – భారత రాష్ట్ర సమితి

వార్డు–4: బాలకృష్ణ – బీఆర్ఎస్

వార్డు–5: అనుమాండ్ల స్వప్న రాణి – భారత జాతీయ కాంగ్రెస్

వార్డు–6: చిలువెరి వెంకన్న – బీఆర్ఎస్

వార్డు–7: తనుకు భార్గవి – బీఆర్ఎస్

వార్డు–8: లోనరే తర – కాంగ్రెస్

వార్డు–9: సలాం బిన్ అహ్మద్ – బీఆర్ఎస్

వార్డు–10: కామెడీ భాగ్యలక్ష్మి – స్వతంత్ర

వార్డు–11: రాపర్తి కార్తీక్ – కాంగ్రెస్

వార్డు–12: ఆత్రం కృష్ణమ్మ – కాంగ్రెస్

వార్డు–13: గుండా స్నేహ – కాంగ్రెస్

వార్డు–14: కొండ భారతీ – కాంగ్రెస్

వార్డు–15: అబ్దుల్లా – కాంగ్రెస్

వార్డు–16: దూడల లక్ష్మి – బీఆర్ఎస్

వార్డు–17: ఎండి అహ్మద్ – బీఆర్ఎస్

వార్డు–18: కస్తూరి పుష్ప – స్వతంత్ర

వార్డు–19: నాగుబాయి – బీఆర్ఎస్

వార్డు–20: షేక్ – బీఆర్ఎస్

మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా ప్రధాన పార్టీలు

మొత్తం 20 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు దక్కించుకోగా, 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపల్ పాలకవర్గ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు.

స్వతంత్రులే కీలకం

నాలుగు స్వతంత్ర అభ్యర్థుల గెలుపుతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు కీలక మలుపు తిరిగాయి. వారి మద్దతు లేకుండా చైర్మన్ ఎన్నిక సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది.

చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్ర సభ్యులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎవరు ఎటు మొగ్గు చూపుతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.