20-02-2026 05:33:57 PM
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్,(విజయక్రాంతి): మునిసిపాలిటీల ప్రజలందరూ తమ ప్రాపర్టీ టాక్స్ ను వెంటనే చెల్లించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మూడు మునిసిపాలిటీలలో ప్రాపర్టీ టాక్స్ బకాయిలు ఎక్కువగా పేరుకుపోయాయని ఆయన తెలిపారు. ప్రాపర్టీ టాక్స్ బకాయిలు ఉన్న ప్రజలంతా విధిగా తమ పన్నులను చెల్లించాలని వివరించారు.
ప్రాపర్టీ టాక్స్ వసూలు కొరకు మూడు మునిసిపాలిటీలలో సోమవారం నుంచి, నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజలు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. పన్నుల చెల్లింపు ద్వారా, మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. కావున మూడు మునిసిపాలిటీల ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి తమ బకాయి పన్నులను చెల్లించాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.