మున్సిపల్ కార్మికులకు వేతనాలివ్వాలి
మేడ్చల్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించనందున కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికులకు వేతనాలు సక్రమంగా రానందున నిత్యవసర సరుకులు, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ప్రతినెల 5వ తేదీ లోపు కార్మికుల ఖాతాలో వేతనాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులకు ఒకపూట పని ఇవ్వాలని, పండుగ సెలవులు, వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కే ఉన్నికృష్ణన్, యూనియన్ నాయకులు ప్రశాంత్, బాలేష్, బిక్షపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






