23 August, 2026 | 6:57 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠలో ఎమ్మెల్యే విజయరమణ రావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •  

మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ మార్నింగ్ వాక్

13-05-2026 02:55 PM

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 36వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాలనీలో పారిశుధ్య పరిస్థితులను స్వయంగా తనిఖీ చేశారు. డ్రైనేజీ సమస్యలు, ఇంటి అవసరానికి ఉపయోగించే నీటీ బావులు, వీధి దీపాల పనితీరుపై స్థానికులవద్ద ఆరా తీసారు. మౌలిక సదుపాయాల్లో ఉన్న సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. స్థానికులతో మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని సూచించారు. డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ ప్రాంత సమస్యలను వైస్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 36వ వార్డులో లో అనారోగ్యంతో బాధపడుతున్న బండి లావణ్య గారిని మున్సిపల్ వైస్ చైర్మన్ గారు పరామర్శించారు.