23 August, 2026 | 7:23 PM

రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి

23-08-2026 06:29 PM

సింగిల్‌ విండో చైర్మన్‌గా అనంతరెడ్డి

దోమకొండ, ఆగస్టు 23( విజయ క్రాంతి): దోమకొండ వ్యవసాయ సహకార సంఘం సింగిల్‌ విండో చైర్మన్‌ గా అనంతరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఆయనకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా, కార్యకర్తగా, క్రమశిక్షణ గల సీనియర్ నాయకుడిగా అనంతరెడ్డి పార్టీకి సేవలందించారని గుర్తు చేశారు. తన సేవలను గుర్తించి దోమకొండ సింగిల్‌ విండో చైర్మన్‌గా నామినేట్ చేయడం ద్వారా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ న్యాయం చేశారని అనంతరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సింగిల్‌ విండో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సహకార సంఘం ద్వారా రైతులకు అందాల్సిన సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు.రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు తదితర సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరెడ్డికి సింగిల్‌ విండో చైర్మన్ పదవి లభించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి సముచిత స్థానం కల్పించడం పట్ల షబ్బీర్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. దోమకొండ వ్యవసాయ సహకార సంఘం మరింత అభివృద్ధి సాధించి రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు