23 August, 2026 | 7:34 PM

తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!

23-08-2026 06:34 PM

రోడ్డు లేక బడీ తండా వాసులకు తీవ్ర ఆటంకాలు

ఈ రహదారికి మోక్షం ఎప్పుడో..?

వర్షాకాలంలొ ప్రయాణంలో మా ఘోష అంతా కాదు 

చేగుంట ఆగస్ట్ 23(విజయక్రాంతి): చేగుంట మండలం కసన్ పల్లి గ్రామం లొ  ఉన్న తండా, వాసులు, అత్యవసర పరిస్థితి,పనులు నిమిత్తం కసన్ పల్లి, చందాయిపేట్ గ్రామానికి రావాలి అంటే బూడిదలు నడుచుకుంటూ రావాల్సిందే, గ్రామస్తులు సర్పంచ్ బిక్య (విజయక్రాంతి ) మీడియా ప్రతినిధి తో ఆవేదనతో మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు మా తండా కి సరైన రోడ్డు, కరెంటు స్తంభాలు,లేక పోవడం మా దురదృష్టకరం, మాతాండవాసులకు ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, గుంతలో పడుకుంటూ, బుడదలో నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి,  అని  ఈ విషయం పై మెదక్ ఎంపీ కి , దుబ్బాక ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లిన నేటి వరకు స్పందన లేకపోవడం  శోచనీయమన్నారు.. మా తండా లొ ఉన్న మల్లన్న గుట్ట నుండి చందాయిపేట్ గ్రామ మూల మలుపు వరకు,  మధ్య రోడ్డు అద్వానంగా ఉన్నదని కల్వర్టు లేక, కనీసం మట్టి కంకర రోడ్డు లేక వర్షాకాలంలో స్కూలుకు వెళ్లే బడీడు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బురుదలో నడుచుకుంటూ ఆపసోపాలు, నానాతంటాలు పడుతున్నారని . 

వర్షానికి రోడ్డు కోతకు గురై స్కూల్ విద్యార్థులు,రైతులకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, మా బాధను అధికారులకు, నాయకులు బాధను పలుమార్లు విన్నవించిన నేటికీ రోడ్డు మంజూరు జరగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ రెండు తండా గ్రామాల మధ్య చీకట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు, భయాందోళనతో వెళ్లడం జరుగుతుందని అన్నారు, ఎన్నికల అప్పుడు మాత్రమే మేము గుర్తుకొస్తామా,ఇంత జరుగుతున్న అధికారులకు గాని, రాజకీయ నాయకులకు గాని మా బాధ కనబడత లేదా,   అన్ని రాజకీయ ప్రభుత్వలు తండా లను, గ్రామాలను అభివృద్ధి చేశామని ప్రగల్బాలు పలకడమే తప్ప,కార్యరూపం దాల్చడం లేదని అన్నారు. ఇకనైనా విద్యార్థుల గోస, రైతుల బాధ,  గమనించి తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు .