రైతులకు నాణ్యతమైన విత్తనాలు సరఫరా చేయాలి
13-05-2026 02:44 PM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్, మే 13,(విజయక్రాంతి): రైతులు సాగు చేసే పంటలకు నాణ్యతమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని దంతాన్ పల్లి హాక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తనాలు, ఎరువులు దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల నుండి విత్తనాలు కొనుగోలుకు రైతులు వస్తారని, వారికి నాణ్యతమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచనలు చేశారు. ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






