calender_icon.png 20 February, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళామణులకే మున్సిపల్ పీఠం

18-02-2026 12:17:52 AM

  1. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలపై మహిళల ఆధిపత్యం
  2. హుస్నాబాద్‌లో కలిసొచ్చిన ఓటమి

సిద్దిపేట, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో మహిళా నా యకత్వం మరోసారి సత్తా చాటింది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు 2 మహిళలకే దక్కడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా చైర్పర్సన్ పదవి మహిళలకు కేటాయిస్తే, వైస్ చైర్పర్సన్ పదవి పురుషులకు ఇవ్వడం ఆనవాయితీగా ఉండగా, ఈసారి మాత్రం మ హిళలే కీలక స్థానాలను అధిరోహించడం రా జకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చైర్మన్ అభ్యర్థి ఓటమిపాలవడం కీలక మలుపు తీసుకొచ్చింది. ఎస్సీ పురుషు ల వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడంతో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు గెలిచి, మహి ళా కౌన్సిలర్లకు చైర్పర్సన్ పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. దీంతో దండి లక్ష్మి కొమురయ్య చైర్పర్సన్గా, చిత్తారి పద్మ వైస్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు.

దుబ్బాక మున్సిపాలిటీలో బీసీ మహిళ రిజర్వేషన్ కావడంతో శ్రీరామ్ సంగీత చైర్పర్సన్గా, ఆస సులోచన స్వామి వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. గ జ్వేల్లో బీసీ మహిళ రిజర్వేషన్ నేపథ్యంలో చందన రవి చైర్పర్సన్గా, కళ్యాణ్కర్ పద్మాబా యి వైస్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. చేర్యాల మున్సిపాలిటీలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించగా ముస్త్యాల అరుణ బలనర్స య్య చైర్పర్సన్గా, మాడిశెట్టి ఉమా వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.

ఇలా 4 మున్సి పాలిటీలలో మహిళలకే 2 కీలక పదవులు ద క్కడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాజకీయ నా యకులు అభిప్రాయపడుతున్నారు. గతంతో పోలిస్తే మహిళలు రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటూ నాయకత్వాన్ని సాధించడంలో ముందంజలో ఉన్నారని చర్చ జ రుగుతోంది. జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో మహిళా చైర్పర్సన్లే ఉండటం ప్రత్యేక తగా నిలిచింది.సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో మహిళా శక్తి మరింత బలపడుతుండగా, స్థానిక పాలనలో కొత్త మార్పులు, అభివృద్ధి దిశగా కొత్త ఆశలు మెల్లగా రూపుదిద్దుకుంటున్నాయి.