calender_icon.png 20 February, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం కుంభకోణం కేసులు వేగవంతం చేయాలి

18-02-2026 12:18:29 AM

సీఎంకు ఫోరం గుడ్ గవర్నెన్స్ వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): 2010 మద్యం కుంభకోణం కేసులను వేగవంతం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం.పద్మనాభరెడ్డి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 2010 మద్యం కుంభకోణం కేసుల్లో చర్యలు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమయంలో మీడియా నివేదికలు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారుల ప్రమే యం ఉందని ఆరోపించాయన్నారు. సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, దానిని ము గించి, దానికి నాయకత్వం వహిస్తున్న డైరెక్టర్ జనరల్‌ను బదిలీ చేశారన్నారు.

తరువా త ఈ కేసును అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ)కి అప్పగించారన్నారు. కొత్తగా చార్జి తీసుకున్న డీజీ ఈ కేసులో అనుమానితులుగా ఉన్న అందరు రాజకీయనాయకులను తప్పించి కేవలం అధికారులు, బినామీలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు మందకొడిగా సాగుతున్నదని, త్వరగా పూర్తి చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.