24 April, 2026 | 12:25 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం

11-02-2026 07:14 PM

జిల్లాలో మున్సిపల్ పోలింగ్ కేంద్రాల తనిఖీ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగుండం,(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో  రామగుండం కార్పొరేషన్ పరిధిలో జ్యోతి నగర్ టిటిఎస్ జడ్.పి.హెచ్.ఎస్, పిటిఎస్ ఎన్టిపిసి ఎస్.టి క్లెయిర్స్, గౌతమ్ నగర్ లోని ప్రగతి పాఠశాల, రాంనగర్ లోని హాట్ హై స్కూల్, అమరావతి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు లక్షా 01 వేయి 470 మంది (56.49) శాతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నరన్నారు.  

ఉదయం 9 గంటల వరకు 9.5%, 11 గంటలకు 24.31%, 1 గంట వరకు 42.12% పోలింగ్ నమోదైందని, 5  గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను పటిష్ఠ భద్రతతో స్ట్రాంగ్ రూం కు తరలించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం తహసిల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.