calender_icon.png 14 February, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికల జోష్

14-02-2026 01:45:52 AM

గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాల ధోరణి వెలువడిన క్షణం నుంచి కార్యకర్తలు గాంధీ భవన్‌కు చేరుకుని జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు.

బాణాసంచా కాల్చి, ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ హ ర్షాతిరేకం వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, పిషర్‌మెన్ కార్పొ రేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు స్వీట్లు పంచుకున్నారు. డోలు వాయించి డ్యాన్స్‌లు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పట్ల విశ్వాసం వ్యక్తంచేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని నేతలు వ్యాఖ్యానించారు.

రాష్ర్టంలో పారదర్శక పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివద్ధి పట్ల ప్రజ లు విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని వారు తెలిపారు. మున్సిపల్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సా ధించిన ఈ విజయాలు భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేస్తాయని వీ హనుమంతరావు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని, అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు.