19 June, 2026 | 8:36 PM

క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ సహకరించాలని

19-06-2026 06:47 PM

మఠంపల్లి,(విజయక్రాంతి):  క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మండలంలోని కృష్ణ తండా సర్పంచ్ బానోత్ రమాదేవి శంకర్ నాయక్ అన్నారు.శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో నిక్షయ్ శివిర్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఎక్స్ రే  పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని,రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం రాత్రి సమయాల్లో చెమటలు పట్టడం లాంటి తదితర లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.అనంతరం క్యాంప్ లో పాల్గొన్న 92 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.