19 June, 2026 | 7:48 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన న్యాయవాది

19-06-2026 06:29 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పాడెం పరుశురాం కూతురు వనస్పతి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం న్యాయవాది పంద్రం శంకర్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా ఆమె హైదరాబాదులోని నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నది విషయం తెలుసుకున్న న్యాయవాది పరామర్శించి ఆమె అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.