19 June, 2026 | 7:48 PM

తంగళ్ళపల్లిలో హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు

19-06-2026 06:31 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయితీ కార్యదర్శి సమీర్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని, హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో ఆరోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.