19 June, 2026 | 7:28 PM

పెన్షన్ దరఖాస్తులు రేటి నుంచి స్వీకరణ

19-06-2026 06:27 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): అర్హులైన కొత్త పెన్షన్ లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను శనివారం (జూన్ 20) నుంచి గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ ఐడీ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఎమ్మార్వో జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా జతపరచాలని సూచించారు. కుటుంబంలో 57 సంవత్సరాలు పూర్తి చేసిన అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వికలాంగులు సదరం ధ్రువీకరణ పత్రం, గీత, నేత, బీడీ కార్మికులు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు సమర్పించాలని కోరారు.