తంగళ్లపల్లికి తహసిల్దార్‌ను వెంటనే నియమించాలి: పౌర సంక్షేమ సమితి
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గత రెండు నెలలుగా తహసిల్దార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజల పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 30 గ్రామాలకు కేంద్రంగా ఉన్న తంగళ్లపల్లి మండలంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉండగా, తహసిల్దార్ లేకపోవడం వల్ల ప్రజా సేవలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కేసీఆర్ కాలనీలో పానీపూరి ఘటన వంటి అత్యవసర పరిస్థితులు చోటుచేసుకున్నప్పుడు సంబంధిత నివేదికలు ఉన్నతాధికారులకు అందించే వ్యవస్థ బలహీనపడుతోందని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఖాళీగా ఉన్న తహసిల్దార్ పోస్టును భర్తీ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బియ్యం కార్ శ్రీనివాస్, కుసుమ గణేష్, చిప్ప దేవదాస్, పసుపునూరి సూర్యప్రకాశ్, ఎండి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.






