calender_icon.png 2 April, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబాయి ఇండియన్స్ బోణీ..

31-03-2025 10:57:48 PM

ముంబాయిఐపీఎల్-2025 18వ సీజన్ లో భాగంగా వాంకడే స్టేడియం వేదికగా జరిగినా మ్యాచులో ముంబాయి ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. కోల్‌కాతా నైట్ రైడార్స్(Kolkata Knight Riders) పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చినా ముంబాయి 12.5 ఓవర్లలో ఛేదించింది. ముంబాయి బ్యాటర్లలో రికెల్ టన్ (62), సూర్యకుమార్ యాదవ్ (27), విల్ జాక్స్ (16) పరుగులు చేశారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా కోల్ కతా 16.2 ఓవర్లకు 116 పరుగులకే ఆలౌటైంది. కోల్ కతా బ్యాటర్లలో రఘువంశీ (26), రమణ్ దీప్ సింగ్ (22), మనీశ్ పాండే (19), రింకు సింగ్ (17), అజింక్య రహానే (11) పరుగులు చేశారు. ముంబాయి బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. దీపక్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్, హర్దిక్ పాండ్య, విఘ్నేశ్ పుతుర్, శాంటర్న్ తలో వికెట్ తీశారు. కాగా,  అశ్వని కుమార్ ఐపీఎల్  అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు వికెట్లు తిసిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించారు.